ఫీజు రీయిoబర్స్‌మెంట్ విడుదల చేయాలి
బీజేవైం జిల్లా అధ్యక్షుడు రాగం అర్జున్ డిమాండ్
మేడ్చల్ అర్బన్, జూలై 26(విజయక్రాంతి):పేద బడుగు బలహీన వర్గాలకు చెందిన విద్యార్థులకు రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీఅంబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని బిజెవైం మేడ్చల్ జిల్లా అధ్యక్షులు రాగం అర్జున్ డిమాండ్ చేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులు సమస్యలపై చేపట్టనున్న ఉద్యమ కార్యక్రమాలు విజయవంతం కోసం సన్నాహక సమావేశం నిర్వహించడం జరిగిందన్నారు.
తెలంగాణ రాష్ట్రంలో చదువుచున్న ఆర్థికంగా వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఫీజు రీయoబర్స్మెంట్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం చెల్లించక పోవడంతో విద్యా సంస్థల యాజమాన్యం విద్యార్థిని విద్యార్థులను మానసికంగా ఇబ్బందులకు గురిచేస్తున్నారని రాగం అర్జున్ స్పష్టం చేశారు.ఇప్పటికైన రాష్ట్ర ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను వెంటనే విడుదల చేయాలని లేనియెడల బిజెవైం ఆధ్వర్యంలో పెద్దఎత్తున ఉద్యమాలు చేస్తామని ఆయన హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో జిల్లా బిజెపి అధ్యక్షులు బుద్ధి శ్రీనివాస్.జిల్లా మాజి అధ్యక్షులు పట్లోళ్ల విక్రమ్ రెడ్డి, బిజెవైం జిల్లా నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు...






