27 July, 2026 | 12:56 AM

కోడెదూడల సంరక్షణే గోవంశ పరిరక్షణ

27-07-2026 12:25 AM

వీహెచ్‌పీ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి

హైదరాబాద్, జూలై 26 (విజయక్రాంతి): వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారి సన్నిధానంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర బృందం ఆదివారం ప్రత్యేక పూ జలు నిర్వహించి, స్వామివారిని దర్శించుకుంది. అనంతరం ఆలయ సంప్రదాయాన్ని, గోసంస్కృతిని ప్రతిబింబించే కోడెదూడల సమర్పణ కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించింది.

ఈ సందర్భంగా విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ధర్మాచార్య సంపర్క ప్రముఖు పగుడాకుల బాలస్వామి మాట్లాడుతూ.. కోడెదూడల సంరక్షణ ద్వారా వ్యవ సాయం, పర్యావరణ పరిరక్షణ, గోవంశ పరిరక్షణకు ప్రాధాన్యం లభిస్తుందన్నారు. ఇది నేటి సమాజానికి అత్యంత అవసరమని ఆయన వివరించారు.

వేములవాడ రాజరాజేశ్వర ఆలయంలో కోడెదూడల సమర్పణకు శతాబ్దాల చరిత్ర, సంప్రదాయం ఉందని బాలస్వామి వివరించారు. భక్తులు మొక్కులు తీర్చుకున్న అనంతరం కోడెదూడలను స్వామివారికి సమర్పించడం ఆనవాయితీగా కొనసాగుతోందని చెప్పారు. కార్యక్రమంలో విశ్వహిందూ పరిషత్ తెలంగాణ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు సునీతరెడ్డి, కార్యాలయ కార్యద ర్శి జగదీశ్వర్, మాతృ శక్తి రాష్ట్ర కోకన్వీనర్ శ్రీవాణి, దుర్గా వాహిని రాష్ట్ర కన్వీనర్ వాణి సక్కుబాయి, దుర్గా వాహిని మహానగర కన్వీనర్ మాధవి, రాజు పాల్గొన్నారు.