25 May, 2026 | 1:06 AM

అన్నం, బియ్యం మేపితే గొర్రెల ప్రాణాలకే ప్రమాదం

25-05-2026 12:00 AM

అసిస్టెంట్ డైరెక్టర్ డా పెంటయ్య

కోదాడ మే 24: చిలుకూరు మండలం దుడియాతండ గ్రామానికి చెందిన ఒక రైతు రెండు గొర్రెపోతుల కొని వాటికి బియ్యం, అన్నం తినిపించడంతో వాటి పొట్ట ఉబ్బి ఆయాసంతో మేతమేయక ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లడంతో వైద్యం కోసం వచ్చిన గొర్రెను పరీక్షించిన అసిస్టెంట్ డైరెక్టర్ డా పి పెంటయ్య ఆదివారం అత్యవసర శస్త్ర చికిత్స నిర్వహించారు. పొట్టలో పేరుకుపోయిన ఆసిడ్ ద్రవాలు గ్యాస్ తొలగించి గొర్రె ప్రాణాలను కాపాడారు. రైతులు ఈ విషయం గుర్తించి పశువులకు, గొర్రెలు మేకలకు అన్నం, బియ్యం లాంటివి మేతలో ఇవ్వకూడదని సూచించారు.  చికిత్సా కార్యక్రమములో సిబ్బంది చంద్రకళ పాల్గొన్నారు