25 May, 2026 | 1:05 AM

సత్తుపల్లి విద్యార్థికి ఎమ్మెల్యే డాక్టర్ మట్ట రాగమయి అభినందనలు

25-05-2026 12:00 AM

సత్తుపల్లి, మే 24(విజయ క్రాంతి ): తెలంగాణ పాలిసెట్ ఎంట్రన్స్ లో 120 కి 120 మారక్స్ తెచ్చుకోవడం ద్వారా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన విశ్వశాంతి విద్యాలయం విద్యార్థి ఎండి. అర్పస్ అలీని ఆదివారం సత్తుపల్లి ఎమ్మెల్యే డాక్టర్ మట్టా రాగమయి దయానంద్, రాష్ట్ర కాంగ్రెస్ నాయకులు డాక్టర్ దయానంద్,సత్తుపల్లి మున్సిపల్ చైర్ పర్సన్ ఎండి. రెహానా బేగం కమల్ పాషా లు అభినందించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే రాగమయి మాట్లాడుతూ.. 

పాలిటెక్నిక్ ఎంట్రన్స్ ఫలితాలలో సత్తుపల్లి విద్యార్థి కి కి స్టేట్ ఫస్ట్ ర్యాంకు రావడం నాకు ఆనందంగా ఉందన్నారు.  ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు కమల్ పాషా, సత్తుపల్లి పిఏ సొసైటీ సహకార సంఘ అధ్యక్షులు చెల్లగల కృష్ణయ్య,టౌన్ పార్టీ అధ్యక్షులు చెన్నారావు, పలువురు కౌన్సిలర్లు,పాఠశాల డైరెక్టర్ నరుకుళ్ల సత్యనారాయణ ,ప్రిన్సిపాల్   పసుపులేటి నాగేశ్వరావు, విద్యార్థి తండ్రి ఆఫ్జల్, మరియు ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.