21 August, 2026 | 1:02 AM

ఫీడింగ్ రూములు ఏర్పాటు చేయాలి

21-08-2026 12:11 AM
  1. తల్లి, బిడ్డల హక్కులకై చట్టం తేవాలి
  2. జాతీయ మహిళా కమిషన్‌కు ఎంపీ లక్ష్మణ్ వినతి

హైదరాబాద్, ఆగస్టు 20 (విజయక్రాంతి): రైల్వే స్టేషన్లు, విమానాశ్రయాలు, మెట్రో స్టేషన్‌లు, బస్ టెర్నినల్స్, న్యాయస్థానాలు, విశ్వవిద్యాలయాలు, ప్రభుత్వ కార్యాలయాలు, పార్కులు తదితర బహిరంగ ప్రదేశాల్లో తల్లుల కోసం ఫీడింగ్ రూములు, బేబీ చేంజింగ్ స్టేషన్లు ఏర్పాటు చేయాలని రాజ్యసభ సభ్యులు డా.కె.లక్ష్మణ్ తెలిపారు.

చైల్డ్ కేర్ రూములు వంటి సదుపాయాలను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని, వారి హక్కులను పరిరక్షించేందుకు కేంద్రం చట్టాన్ని తీసుకురావాల్సిన అవసరం ఉందన్నారు. గురువారం ఢిల్లీలో జాతీయ మహిళా కమిషన్‌కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ ఈ విషయంపై తాను రాజ్యసభలో ప్రస్తావిస్తూ.. తల్లుల ఫిర్యాదుల పరిష్కారానికి సమర్థవంతమైన వ్యవస్థను కల్పించడం అవసరమన్నారు.