8 June, 2026 | 6:41 PM

Breaking News

పారా క్రీడాకారులకు రిజర్వేషన్లు వెంటనే అమలు చేయాలి   •   ఘనంగా గోపూజ, అన్నదానం   •   జైనూర్ గ్రామ సభలో అభివృద్ధి ప్రణాళికలపై చర్చ   •   నీట్ (యూజీ)-2026 పునఃపరీక్ష నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: జిల్లా కలెక్టర్ అంకిత్   •   10న కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నాను విజయవంతం చేయండి: కళ్లెం కృష్ణ   •   ప్రైవేటు, కార్పొరేట్ విద్యాసంస్థల్లో ఫీజు నియంత్రణ చట్టాన్ని అమలు చేయాలి   •   సమస్యలను పరిష్కరించేందుకు నిరంతరం కృషి చేస్తా   •   జాతీయ లోక్ అదాలత్ ను విజయవంతం చేద్దాం   •   ఈనెల 10న సిద్ధాపూర్ కు మంత్రి ఉత్తమ్ రాక   •   విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ఘోర ప్రమాదం.. 8 మంది మృతి   •  

ఆచార్య కలవకుంట రామకృష్ణ కు సత్కారం

08-06-2026 05:36 PM

ముకరంపుర,(విజయక్రాంతి): స్థానిక ఎస్సారార్ ప్రభుత్వ కళాశాల ప్రిన్సిపల్ ఆచార్య కలవకుంట రామకృష్ణకు చైతన్య సారస్వత పరిషత్తు, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో జూన్ 6, 7 తేదీలలో గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ రాజమండ్రిలో నిర్వహించిన ఏడవ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభల్లో సాహిత్య బంధు పురస్కారం ప్రకటించారు. ఈ పురస్కారాన్ని గోదావరి గ్లోబల్ యూనివర్సిటీ ఛాన్సలర్, మాజీ ఎమ్మెల్సీ కెవివి సత్యనారాయణ రాజు, శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ అధ్యక్షుడు డాక్టర్ కత్తిమండ ప్రతాప్, జాతీయ అధ్యక్షురాలు ఈశ్వరి భూషణంల చేతుమీదుగా ఆచార్య కలవకుంట రామకృష్ణ ఈ సాహితీ బంధు పురస్కారాన్ని స్వీకరించారు. వీరు రచించిన  కవితా సంపుటాలు హిందీ, ఇంగ్లీష్ భాషల్లోకి అనువాదం చేయబడ్డాయి .తెలుగును జాతీయస్థాయిలో వెలిగిస్తున్న కలువకుంట రామకృష్ణకు ఈ అవార్డు రావడం  కరీంనగర్ జిల్లాకు,కళాశాలకు గర్వకారణమని కళాశాల స్టాఫ్ క్లబ్ పక్షాన కలువకుంట రామకృష్ణ కు కళాశాలలో ఘనంగా అభినందన సత్కారం చేశారు.