26 July, 2026 | 5:57 AM

కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు అండగా నిలుస్తాం

08-06-2026 05:39 PM

* ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్

ఉట్నూర్,(విజయక్రాంతి): ఇంద్రవెల్లి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ కార్యాలయాన్ని నిర్మల్ డిసిసి అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్  ప్రారంభించారు. ముందుగా కాంగ్రెస్ పార్టీ జెండా ఆవిష్కరించారు. అనంతరం పార్టీ నాయకులతో కలిసి మండల పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ ముందుగా నూతన మండల,పట్టణ అధ్యక్షులకు శుభాకాంక్షలు తెలిపారు. పార్టీ బలోపేతానికి కృషి చేయాలి. కార్యకర్తలకు పార్టీ, ప్రభుత్వం అండగా నిలుస్తుంది అన్నారు.

మంగళవారం ఉట్నూరులో  నిర్వహించే బిఎల్ఎ ట్రైనింగ్ బిఎల్ఎ లు  సమావేశానికి ప్రతి ఒక్కరు  హాజరు కావాలన్నారు.దేశంలో ఇంధన కొరత వల్ల ఇంధన ఆదా చేయడంలో భాగంగానే నేను కూడా ద్విచక్ర వాహనం పైన పర్యటిస్తున్న అన్నారు.కాంగ్రెస్ పార్టీ కార్యక్రమాలను,ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి అన్నారు.సీనియర్ కాంగ్రెస్ నాయకులు సోమసే నాగోరావ్ గారు పార్టీకి చేసిన సేవలు గుర్తు చేశారు.పార్టీలో కొత్త పాత తేడా లేకుండా ప్రతి ఒక్కరు పార్టీ బలోపేతానికి కృషి చేయాలి అన్నారు.