24 June, 2026 | 2:06 AM

10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విజేతలకు సన్మానం

24-06-2026 12:03 AM
  1.    4 స్వర్ణ పతకాలతో లీషా కిరణ్ సత్తా  
  2. చిక్కం యశ్రీ సేనన్యకు నాలుగు రజత,  
  3. సూర్యకృష్ణ చిత్తూరుకు మూడు పతకాలు

హైదరాబాద్, జూన్ 23(విజయక్రాంతి): తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ ఆధ్వర్యం లో గచ్చిబౌలిలోని సాట్స్ షూటింగ్ రేంజ్ లో జరుగుతున్న XII ఓపెన్ తెలంగాణ రాష్ట్ర ఎయిర్, స్మాల్ బోర్, షాట్‌గన్ షూటింగ్ పోటీలు విజయవంతంగా కొనసాగుతున్నా యి. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ విభాగంలో 247 మంది షూటర్లు, స్కీట్, ట్రాప్ విభాగాల్లో 76 మంది షూటర్లు పాల్గొన్నారు.

ఛాంపియన్‌షిప్‌లో భాగంగా తొలి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం మంగళవారం గచ్చిబౌలిలోని సాట్స్ షూటింగ్ రేంజ్‌లోని 10 మీటర్ల రేంజ్‌లో ఘనంగా నిర్వ హించారు. 10 మీటర్ల ఎయిర్ పిస్టల్, ట్రాప్, స్కీట్ విభాగాల్లో విజేతలైన షూటర్లకు పతకాలు, ప్రశంసాపత్రాలు అందజేశారు.ఈ కా ర్యక్రమానికి రాజ్యసభ సభ్యులు ఎం. అనిల్ కుమార్ యాదవ్ ముఖ్య అతిథిగా హాజరుకాగా, తెలంగాణ రైఫిల్ అసోసియేషన్ అధ్య క్షులు, నేషనల్ రైఫిల్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (ఎన్‌ఆర్‌ఏఐ) సీనియర్ ఉపాధ్యక్షులుఅమిత్ సంఘీ అతిథి విశిష్టులుగా పాల్గొన్నారు.

ఈ సందర్భంగా అమిత్ సంఘీ మాట్లాడుతూ ప్రతి పతకం వెనుక కృషి, క్ర మశిక్షణ, అంకితభావం ఉంటాయని అన్నా రు. యువ క్రీడాకారుల ఎదుగుదలకు సహకరిస్తున్న తల్లిదండ్రులు, కోచ్లు, అధికారులు, వాలంటీర్లను ఆయన అభినందించారు.ఈ పోటీల్లో లీషా కిరణ్ అత్యుత్తమ ప్రదర్శనతో అందరి దృష్టిని ఆకర్షించింది. మహిళలు, జూనియర్ మహిళలు, యూత్ మహిళలు, సబ్ యూత్ మహిళల విభాగాల్లో వరుసగా నాలుగు స్వర్ణ పతకాలు సాధించి రోజు మొ త్తం అత్యధిక పతకాలు గెలుచుకున్న క్రీడాకారిణిగా నిలిచింది.

నాలుగు విభాగాల్లోనూ ఆమె 377/400 స్కోరు నమోదు చేయడం విశేషం.చిక్కం యశ్రీ సేనన్య ఇదే విభాగాల్లో నాలుగు రజత పతకాలు సాధించి తన స్థిరమైన ప్రతిభను చాటుకోగా, సూర్యకృష్ణ చి త్తూరు యూత్ మెన్, సబ్ యూత్ మెన్ వి భాగాల్లో స్వర్ణాలు, జూనియర్ మెన్ విభాగంలో రజత పతకం సాధించి మూడు పత కాలతో మెరిశాడు. ఇదే రోజు నిర్వహించిన 50 మీటర్ల రైఫిల్, 50 మీటర్ల ఓపెన్ సైట్ రైఫిల్, 50 మీటర్ల ఓపెన్ సైట్ త్రీ పొజిషన్ పోటీలు కూడా ముగిశాయి.

ఆయా విభాగాల్లో ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను సన్మానించారు. మిగిలిన పోటీలైన 50 మీట ర్ల రైఫిల్ త్రీ పొజిషన్ (పురుషులు, మహిళలు), డబుల్ ట్రాప్, 10 మీటర్ల ఎయిర్ రైఫిల్, ఓపెన్ సైట్ రైఫిల్, 25 మీటర్ల పిస్టల్, 50 మీటర్ల పిస్టల్ పోటీలు కొనసాగనున్నాయి. తదుపరి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం ఈ నెల25 సాయంత్రం 4 గంటలకు నిర్వహించనున్నారు.