యువత దేశనిర్మాణంలో కీలక పాత్ర పోషించాలి
బీజేవైఎం ఆధ్వర్యంలో నమో జెన్ జెడ్ కాన్‌క్లేవ్
ముషీరాబాద్, జూన్ 23 (విజయక్రాంతి): యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. భారతీయ జనతా యువ మోర్చా రాష్ట్ర (బీజేవైఎం) తెలంగాణ ఆధ్వర్యంలో నమో జెన్ జెడ్ కాన్క్లేవ్ కార్యక్రమం మంగళవారం హైదరాబాద్లోని ఆర్టిసి కళాభవన్, బాగ్ లింగంపల్లిలో నిర్వహించారు.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు ఎన్. రాంచందర్ రావు, బీజేపీ శాసనసభాపక్ష నాయకులు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, ఎంపీ ఈటల రాజేందర్, ఎమ్మెల్యే పాల్వాయి హరీష్ బాబు ఎమ్మెల్సీ అంజిరెడ్డి పాల్గొన్నారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో గత 12 సంవత్సరాలుగా దేశంలో చోటుచేసుకున్న అభివృద్ధి, యువత సాధికారత, స్టార్టప్ల ప్రోత్సాహం, ఉపాధి అవకాశాల కల్పన, డిజిటల్ ఇండియా, స్కిల్ ఇండియా, స్టార్టప్ ఇండియా వంటి కార్యక్రమాల ద్వారా యువతకు లభించిన అవకాశాల గురించి వివరించారు. యువత దేశ నిర్మాణంలో కీలక పాత్ర పోషించాలని, అభివృద్ధి చెందిన భారతదేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో బీజేవైఎం తెలంగాణ రాష్ట్ర అధ్యక్షులు గణేష్ కుండే, ప్రధాన కార్యదర్శులు జి. హరీశ్వర్ రెడ్డి, మల్కా యశస్వి , రాష్ట్ర ఉపాధ్యక్షులు ప్రవీణ్ రెడ్డి, సందీప్ గౌడ్, నితిన్ నందకర్, అనితా రెడ్డి, శరత్ చంద్ర, సాయినాథ్, రాష్ట్ర కార్యదర్శులు శివ చంద్రగిరి, వరప్రసాద్ రెడ్డి, అరవింద్ రెడ్డి, హరిప్రసాద్, ప్రదీప్ రావు, ఝాన్సీ, కోశాధికారి నరేన్ దేశ్పాండే, కార్యకర్తలు పాల్గొన్నారు.






