05-10-2025 12:25:27 AM
చర్ల, అక్టోబర్ 4, (విజయక్రాంతి): చర్ల సరిహద్దు రాష్ట్రమైన ఛత్తీస్‌ఘడ్ రాష్ట్రంలోని బీజాపూర్ జిలా మద్దీద్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బందేపారా అడవిలో మావోయిస్టులు ఐఈడీ అమర్చుతుండగా అది పేలడంతో మావోయిస్టు సభ్యురాలు తీవ్రంగా గాయపడింది. సంఘటన అనంతరం ఆమె సహచ రులు గాయపడిన సభ్యురాలిని అడవిలో వదిలి పారిపోయారు.
దీంతో స్థానికులు పోలీసులకు సమచారం అందించడంతో గాయపడిన మావోయిస్టురాలిని గ్రామస్తుల సహాయంతో బీజాపూర్ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కాగా గుజ్జా సోధి కొన్ని సంవత్సరాలుగా ఏసీఎం -కన్నా బుచ్నాతో పాటు మద్దీద్ ఏరియా కమిటీలో పార్టీ సభ్యురాలిగా చురుగ్గా పనిచేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.
సమాజం నుంచి దారి తప్పిన యువత హింస మార్గాన్ని విడిచిపెట్టి ప్రధాన స్రవంతిలో చేరాలని జిల్లా పోలీసులు విజ్ఞప్తి చేస్తున్నారు. పోలీసులు సాధ్యమైన అన్ని విధాలుగా సహాయం అందించడానికి సిద్ధంగా ఉన్నారని పోలీసు ఉన్నతాధికారులు తెలియజేస్తున్నారు.