05-10-2025 12:37:18 AM
అదనపు చార్జీలు వసూలు చేస్తే సంస్థలను గుర్తిస్తున్నాం
కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి
న్యూఢిల్లీ, అక్టోబర్ 4: ‘వినియోగదారులు క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకు న్నప్పుడు ఈజూ సంస్థలు అదనపు ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. వినియోగదారుల నుంచి మాకు వేలాదిగా ఫిర్యాదులు వస్తున్నాయి. వినియోగదారులను తప్పుదోవ పట్టించి అదనంగా డబ్బు వసూలు చేయడాన్ని సహించబోం. ఇప్పటికే కేంద్ర వినియోదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ దర్యాప్తు ప్రారంభించింది.
దోపిడీకిపాల్పడుతున్న సంస్థలపై కఠిన చర్యలు తీసుకుంటాం’ అని కేంద్ర వినియోదారుల వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి తాజాగా హెచ్చరించారు. ఈ కామర్స్ ద్వారా ఓ ప్రొడక్ట్ కొన్న నెటిజన్ క్యాష్ ఆన్ డెలివరీ ఆప్షన్ ఎంచుకున్నాడు. ఊహించని రీతిలో సదరు నెటిజన్ అదనపు ఛార్జీ చెల్లించాడు. తనకు జరిగిన చేదు అనుభవాన్ని సోషల్‌మీడియాలో పంచుకున్నాడు. ‘వర్షాల సమయంలో ఫుడ్ డెలివరీ యాప్‌లు విధించే అదనపు ఫీజులనే భరించలేకపోతున్నామంటే..
అదే దారిలో ఈ సంస్థలు కూడా పయనిస్తున్నాయి. ఆఫర్ హ్యాండ్లింగ్ ఫీజు (కంపెనీ ప్రకటించిన డిస్కౌంట్లకు), పేమెంట్ హ్యాండ్లింగ్ ఫీజు, ప్రొడక్ట్ ప్రామిస్ ఫీజు.. అంటూ ఏవేవో ఛార్జీలు వసూలు చేస్తున్నాయి. ఇకపై యాప్ స్క్రోల్ చేస్తున్నందుకు కూడా ఫీజులేస్తారేమో?’ అంటూ ఆగ్రహం వ్యక్తం చేశాడు. ఈ పోస్ట్‌కు కేంద్రమంత్రి ప్రహ్లాద్ జోషి స్పందిస్తూ ఈజూ సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు.