ఎరువుల ధరలు తగ్గించాలి
11-08-2026 01:02 AM
సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్
బెజ్జంకి, ఆగస్టు 10 (విజయక్రాంతి) : ఎరువుల ధరలు వెంటనే తగ్గించి రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని సీపీఎం మండల కార్యదర్శి తిప్పారపు శ్రీనివాస్ డిమాండ్ చేశారు. బెజ్జంకి మండల కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో ఎరువుల ధరల పెంపునకు వ్యతిరేకంగా నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ విధానాలతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని విమర్శించారు.
పంటలకు కనీస మద్దతు ధరల చట్టాన్ని పార్లమెంటులో ఆమోదించి, స్వామినాథన్ కమిషన్ సిఫార్సుల మేరకు రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు బొమ్మిడి సాయికృష్ణ, సంఘ ఎల్లయ్య, బోనగిరి లింగం తదితరులు పాల్గొన్నారు.






