ఎస్సీ సెల్ నూతన అధ్యక్షులకు కోట నీలిమ సన్మానం
సికింద్రాబాద్, ఆగస్టు 10 (విజయక్రాంతి): సనత్నగర్ నియోజకవర్గ పరిధిలోని 8 డివిజన్లకు కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షుల నియామకం తాజాగా జరిగింది. సనత్నగర్ డివిజన్ అధ్యక్షుడిగా ప్రవీణ్ కుమార్, బీకే గూడ డివిజన్ అధ్యక్షుడిగా సుధీర్ కుమార్, అమీర్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా అరుణ్ కుమార్, ఎస్‌ఆర్ నగర్ డివిజన్ అధ్యక్షుడిగా రాజు, బేగంపేట్ డివిజన్ అధ్యక్షుడిగా శ్రీకాంత్, రాంగోపాల్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా విజయ్ కుమార్, బన్సీలాల్పేట్ డివిజన్ అధ్యక్షుడిగా మహేష్, పద్మారావునగర్ డివిజన్ అధ్యక్షుడిగా సాయి కుమార్ నియమితులయ్యారు.
అదేవిధంగా నియోజకవర్గ పరిధిలో పాండు జిల్లా వైస్ ప్రెసిడెంట్గా, శంకర్, సౌభాగ్య, మార్ కొండయ్య ప్రధాన కార్యదర్శులుగా, వెంకటేష్, అభిషేక్ జిల్లా కా ర్యదర్శులుగా, నవీన్ రాజ్ నియోజకవర్గ అధ్యక్షుడిగా నియమితులయ్యారు. నూతనంగా నియమితులైన ఎస్సీ సెల్ నాయకులు సోమవారం పీసీసీ వైస్ ప్రెసిడెంట్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి కోట నీలిమను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా డాక్టర్ కోట నీలిమ నూతనంగా నియమితులైన నాయకులను సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు.
ఈ సందర్భంగా నూతన ఎస్సీ సెల్ నాయకులు మాట్లాడుతూ తమపై నమ్మకం ఉంచి బాధ్యతలు అప్పగించినందుకు సికింద్రాబాద్ జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు దీపక్ జాన్, సనత్నగర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి డాక్టర్ కోట నీలిమకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.






