13 July, 2026 | 9:37 PM

Breaking News

నులిపురుగుల నివారణ మాత్రలు తప్పక వేయించాలి   •   వైటీసీ ద్వారా నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలి   •   జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవ సందర్బంగా ఆల్బండజోలు మాత్రలు పంపిణి   •   పదోన్నతిపై బదిలీ అయిన పోస్టల్ ఉద్యోగులకు ఘనంగా సన్మానం   •   విద్యార్థినీల పట్ల నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవు   •   ప్రజావాణి దరఖాస్తులు క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిష్కరించాలి   •   లక్క పురుగుతో ఇబ్బందులు పడుతుంటే అధికారులు నిద్రపోతున్నారా..?   •   వైటీపీఎస్ టెండర్లను రద్దు చేయాలి   •   రహదారి నిర్మాణం చేప‌ట్టాల‌ని వినతి   •   సర్ పత్రాల సేకరణను పరిశీలించిన మాజీ మున్సిపల్ చైర్మన్ జంగం గంగాధర్   •  

ఘనంగా ఎదుర్కోలు ఉత్సవం

27-03-2026 01:49 AM

తరలివచ్చిన వేలాదిమంది భక్తులు 

భద్రాద్రి కొత్తగూడెం, మార్చి 26 (విజయక్రాంతి): భద్రాచలం మిథుల స్టేడియం ప్రవేశ మార్గం వద్ద గురువారం సాయంత్రం భద్రాద్రి రామయ్య ఎదుర్కోలు ఉత్సవం నిర్వహించారు. ప్రధాన దేవాలయం నుంచి వివిధ వాహనాల ద్వారా స్వామివారిని, అమ్మవారిని ఊ రేగింపుగా స్టేడియం ముందు ఉన్న ఉత్తర ద్వారం వద్దకు తీసుకొచ్చారు. అనంతరం అర్చకులు స్వామివారిని అ మ్మవార్లను వేరువేరుగా ఉంచి ఎదుర్కోలు ఉత్సవాన్ని నిర్వహించారు.

ఈ సందర్భంగా అర్చకులు రెండు వర్గాలుగా విడిపోయి రామయ్య గొప్పతనాన్ని కొందరు అలాగే సీతమ్మ గొప్పతనాన్ని గురించి మరి కొందరు పో టీపడి వివరించారు. చివరకు రామయ్య సీతమ్మల గొప్పతనాన్ని పొగుడుతూ ఎదుర్కోలు ఉత్సవాన్ని ముగించా రు. అర్చకులు దండలతో నిత్యాలు చేసి అనంతరం పూలదండలను అమ్మవారికి రామయ్యకు అలంకరింపజేశారు.

దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ శైలజ అ య్యంగార్ దేవదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు స్వామివారికి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా స్వామివారికి పట్టు వస్త్రాలు తయారుచేసిన రాపోల్ గణేష్ బృందం వారి తయారుచేసిన చేనే త వస్త్రాలను రామయ్యకు బహుకరించారు.