శ్రీ రాజరాజేశ్వర స్వామి ఆశీస్సులతో తోట లహరికి పదవి దక్కేనా?
వేములవాడ, మార్చి 26,(విజయక్రాంతి): రాజన్న సిరిసిల్ల జిల్లా,వేములవాడ పట్టణంలో సామాజిక సేవా కార్యక్రమాలతో ప్ర జల మనసులు గెలుచుకున్న తోట లహరి రాజకీయంగా మరో మెట్టు ఎక్కుతారా అనే చర్చ జోరుగా సాగుతోంది. పట్టణ ప్రజలతో సత్సంబంధాలు కొనసాగిస్తూ, ముఖ్యంగా మహిళలను ఏకతాటిపైకి తీసుకువచ్చి కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి ఆమె చేసిన కృషి ప్రస్తావనీయంగా మారింది.
పార్టీ కష్టకాలంలోనూ వెనుకడుగు వేయకుండా, ఆది శ్రీని వాస్ మార్గదర్శకత్వంలో గత ఎనిమిదేళ్లుగా వార్డు స్థాయి నుంచి పట్టణ, జిల్లా స్థాయి వరకు జరిగే ప్రతి కార్యక్రమంలో చురుకుగా పాల్గొంటూ పార్టీకి అండగా నిలిచారు. 20 23 ఎన్నికల ప్రచారంలోనూ, స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ గడపగడపకు వెళ్లి కాంగ్రెస్ పార్టీ గెలుపులో తనవంతు పాత్ర పోషించారు.ఇలాంటి సేవా దృక్పథం, క్రమశిక్షణ, పార్టీ పట్ల నిబద్ధతను దృష్టిలో ఉంచుకొని తోట లహరికి తగిన గుర్తింపుగా నామినేటెడ్ పదవి ఇవ్వాలని పట్టణ ప్రజలు, అభిమానులు, శ్రేయోభిలాషులు బహిరంగంగా కోరుతున్నారు.ఈ నేపథ్యంలో, పార్టీ నాయకత్వం తోట లహరి సేవలను గుర్తించి ఆమె కు పదవి కట్టబెట్టే అవకాశముందా అన్నది ప్రస్తుతం వేములవాడ రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చగా మారింది.




