రెవెన్యూ శాఖలో ప్రమోషన్ల పర్వం!
21-05-2024 01:48 AM
డీపీసీ ఏర్పాటుకు నవీన్ మిట్టల్ ఉత్తర్వులు జారీ
హైదరాబాద్ సిటీబ్యూరో, మే 20 (విజయక్రాంతి): రెవెన్యూ శాఖ లో పదోన్నతులపై ప్రభుత్వం దృష్టి సారించింది. ఈ మేరకు అర్హుల ఎం పికపై డీపీసీని నియామకానికి గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఇందుకు సంబం ధించిన ఉత్తర్వులను రెవెన్యూ శాఖ ముఖ్య కార్యదర్శి నవీన్ మిట్టల్ సోమవారం జారీ చేశారు. డీపీసీ కమిటీ చైర్ పర్సన్/కన్వీనర్‌గా సీసీఎల్‌ఏ కమిషనర్ వ్యవహరించనున్నా రు. ఎక్సైజ్ శాఖ కమిషనర్, స్టాం పులు రిజిస్ట్రేషన్ శాఖ డిప్యూటీ, జాయింట్, అడిషనల్ సెక్రటరీలు సభ్యులుగా ఉంటారని మిట్టల్ తన ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. .






