29 August, 2026 | 7:28 AM

హరీశ్‌రావు మతిభ్రమించి విమర్శలు చేస్తుండు

21-05-2024 01:47 AM

పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి 

హైదరాబాద్, మే 20 (విజయక్రాంతి): మాజీ మంత్రి హరీశ్‌రావు మతిభ్రమించి మాట్లాడుతున్నారని పీసీసీ అధికార ప్రతినిధి భవానీరెడ్డి  విమర్శించారు. పదేళ్ల పాలనలో ఎవరికీ న్యాయం చేయలేదనే.. గత ఎన్నిల్లో బీఆర్‌ఎస్‌ను ప్రజలు పక్కన పెట్టిన విషయాన్ని తెలుసుకోవాలని హితవు పలికారు. సోమవారం గాంధీభవన్‌లో పీసీసీ అధికార ప్రతినిధులు లింగంయాదవ్, శ్రీనివాస్ నేతతో కలిసి ఆమె మీడియాతో మాట్లాడారు. ఉద్యోగస్థులకు వేతనాలు ఇవ్వలేని పరిస్థితికి రాష్ట్రాన్ని తీసుకొచ్చిన ఘతన కేసీఆర్‌కే దక్కుతుందని విమర్శించారు. ప్రజలకు కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన అందిస్తుంటే, బీఆర్‌ఎస్ నాయకులు ఓర్చుకోవడం లేదని మండిపడ్డారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను ప్రభుత్వం అమలు చేస్తుందని స్పష్టంచేశారు.