23 June, 2026 | 12:18 PM

ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య ఇళ్ల పంచాయితీ

15-06-2024 12:05 AM
  • కలెక్టర్‌కు ఎమ్మెల్యే సంజయ్ కుమార్ ఫిర్యాదు

జగిత్యాల, జూన్ 14 (విజయక్రాంతి): జగిత్యాలలో ఇళ్ల నిర్మాణాలు ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మధ్య పంచాయితీకి దారి తీసింది. ఎమ్మెల్సీ తీరుపై ఎమ్మెల్యే గుర్రుగా ఉన్నారు. శుక్రవా రం ఎమ్మెల్యే డాక్టర్ సంజయ్‌కుమార్ ఏకంగా కలెక్టర్ వద్దకు వెళ్లి ఎమ్మెల్సీ తీరుకు వ్యతిరేకంగా లేఖ అందజేయడం చర్చనీయాంశంగా మారింది. కలెక్టర్‌ను కలిసిన అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ.. జగిత్యాల 4వ వార్డులో అక్రమంగా నిర్మాణాలు  జరుగుతున్నాయని ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి కలెక్టర్‌కు ఫిర్యాదు చేయడం పట్ల మండిపడ్డారు.

అక్రమ  నిర్మాణాలు ఎక్కడ జరగడం లేదా? అని ధ్వజమెత్తారు. ప్రత్యేక అధికారులను నియమించి అక్రమ నిర్మాణాలను గుర్తించి తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ను కోరినట్లు ఎమ్మెల్యే పేర్కొన్నారు. అక్రమ నిర్మాణాలు కూల్చే వేసే పరిస్థితి వస్తే జగిత్యాలలో భూకంపం వస్తుందన్నారు. ముప్పాల చెరువు పూర్తిగా పాడైందని, మోతే చెరువు కలుషితం కాకుండా వీక్లీ బజార్ నుంచి డ్రైనేజీ నిర్మించామని తెలిపారు. జగిత్యాలలో 2006 నుంచి 2024 ఎంపి ఎన్నికల్లో సైతం జగిత్యాల ప్రజలు జీవన్‌రెడ్డిని తిరస్కరించారని ఎమ్మెల్యే ఎద్దేవాచేశారు.