17 March, 2026 | 3:24 AM

మూడు వారాల్లోగా కౌంటర్ దాఖలు చేయండి

17-03-2026 02:11 AM
  1. బీఆర్‌ఎస్ న్యాయవాదిని ఆదేశించిన హైకోర్టు
  2. కోకాపేటలో బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై విచారణ
  3. ఉన్నత న్యాయస్థానంలో పిల్ వేసిన సుపరిపాలన వేదిక

హైదరాబాద్, మార్చి 16: బీఆర్‌ఎస్ పార్టీ కార్యాలయానికి భూమి కేటాయింపుపై సోమవారం హైకోర్టులో విచారణ జరిగింది. కోకా పేటలో బీఆర్‌ఎస్‌కు 11 ఎకరాలు కేటాయించడాన్ని సవాల్ చేస్తూ పిటిషన్లు వేశారు. సుప రిపాలన వేదిక దాఖలు చేసిన పిల్‌పై హైకోర్టు విచారణ జరిపింది. బీఆర్‌ఎస్‌కు నామమాత్రపు ధరకే భూమి కేటాయించారని పిటిషనర్లు వాదించారు.

ప్రభుత్వానికి 1,100 కోట్ల రూపాయల నష్టం వాటిల్లుతోందని పిటిషనర్లు పేర్కొన్నారు. అయితే బీఆర్‌ఎస్ తరఫు న్యాయవాది వాదనలు వినిపిస్తూ రాజకీయ దురుద్ధేశంతోనే పిల్ దాఖలు చేసారని పేర్కొన్నారు. ఇరు పక్షా ల వాదనలు ఉన్న ఉన్నత న్యాయస్థానం మూ డు వారాల్లో కౌంటర్ దాఖలు చేయాలని బీఆర్‌ఎస్ న్యాయవాదిని ఆదేశించింది. కాగా నాలు గేళ్ల క్రితం బీఆర్‌ఎస్ కార్యాలయానికి కోకాపేటలో భూమి కేటాయింపు జరిగింది.