10-08-2025 02:50:36 PM
హైదరాబాద్: నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు(Former MLA Guvvala Balaraju) బీజేపీలో చేరారు. ఆదివారం హైదరాబాద్ లోని నాంపల్లిలో బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో జరిగిన కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు(BJP State President Ramchander Rao) బాలరాజుకు బీజేపీ కండువతో స్వాగతం పలికారు. గువ్వల బాలరాజుతో పాటు, ఆయన అనుచరులు, నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులు కూడా బీజేపీలో చేరారు. గువ్వల బాలరాజు కొన్ని రోజుల క్రితం బీఆర్ఎస్ పార్టీకి రాజీనామా చేసినప్పటి నుండి, ఆయన ఏ పార్టీలో చేరుతారనే దానిపై తీవ్ర చర్చ జరుగుతోంది.
గతంలో తనపై దాడి జరిగినప్పుడు తనకు అండగా నిలిచి, తగిన ప్రాధాన్యత ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ పట్ల తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలోనే ఆయన పార్టీని వీడి ఇటీవల బీజేపీలో చేరి ఊహాగానాలకు తెరదించారు. ఈ సందర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్ రావు మాట్లాడుతూ, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ అమలు చేస్తున్న ప్రజా సంక్షేమ పథకాలను, దేశవ్యాప్తంగా బీజేపీకి పెరుగుతున్న మద్దతును చూసిన తర్వాత గువ్వల బాలరాజు పార్టీలో చేరాలని నిర్ణయించుకున్నారని అన్నారు. తెలంగాణలో పార్టీని బలోపేతం చేయడానికి ఆయన సేవలను పూర్తిగా వినియోగించుకుంటామని హామీ ఇచ్చారు.