10-08-2025 02:54:13 PM
నంగునూరు: నంగునూరు మండలం(Nanganur Mandal) గట్లమల్యల గ్రామానికి చెందిన మందంపల్లి రాజు తన పాడి ఆవు కరెంట్ షాక్ తో మృతి చెందింది. పొలం గట్ల వెంబడి మేస్తున్న ఆవుకు విద్యుత్ తీగలు తగలడంతో షాక్ సంభవించింది. దాంతో అవు అక్కడికక్కడే మృతి చెందింది. రైతుకు జీవనాధారమైన అవు మరణించడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి తగిన సహాయం అందించాలని కోరారు.