10-08-2025 02:28:15 PM
ఆయా గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించిన పార్టీ నాయకులు కార్యకర్తలు
చొప్పదండి (విజయక్రాంతి): చొప్పదండి ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం(MLA Medipally Sathyam) ఆధ్వర్యంలో రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు సాధిస్తుందని మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు పురుమల్ల మనోహర్ అన్నారు. పల్లె పల్లెకు కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా గంగాధర మండలం నాగిరెడ్డిపూర్, లక్ష్మీదేవిపల్లి, మధురానగర్ గ్రామాల్లో కాంగ్రెస్ పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ... ప్రజా సంక్షేమమే లక్ష్యంగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తుందన్నారు. ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో గ్రామ గ్రామాన ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసి కాంగ్రెస్ పార్టీని విజయపథంలో నిలపాలని సూచించారు.
గత బీఆర్ఎస్ పార్టీ హాయంలో చొప్పదండి నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో నిలిచిందని, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎమ్మెల్యే మేడిపల్లి సత్యం ఆధ్వర్యంలో పదండి నియోజకవర్గం అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షుడు దుబ్బాసి బుచ్చయ్య,రామిడి రాజిరెడ్డి ,మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ తోట కరుణాకర్, ఒడ్నాల యగ్నేష్, దోర్నాల శ్రీనివాసరెడ్డి, రోమాల రమేష్, సత్తు కనుకయ్య,సాయిగౌడ్, గుజ్జుల బాపు రెడ్డి, కర్ర బాపురెడ్డి, అట్లా శేఖర్ రెడ్డి,వేముల అంజి,గంగాధర సుదర్శన్, రేండ్ల శ్రీనివాస్, పడితపల్లి కిషన్,రాచమల్ల భాస్కర్,గరిగంటి కర్ణాకర్, ముచ్చ శంకరయ్య,మ్యాక వినోద్,రెండ్ల రాజిరెడ్డి,గడ్డం అంజయ్య,కుమార్ స్వామి , నాగేంద్రర్ రెడ్డి,తదితరులు పాల్గొన్నారు.