10-08-2025 02:56:01 PM
ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ..
మందమర్రి (విజయక్రాంతి): ప్రజా సంక్షేమమే ధ్యేయంగా సమాజంలో అన్ని వర్గాల ప్రజలకు సేవలందించడమే లక్ష్యంగా ప్రజాసేవ వెల్ఫేర్ సొసైటీ కృషి చేస్తుందని సంస్థ వ్యవస్థాపక అధ్యక్షులు షేక్ అజిమొద్దిన్ స్పష్టం చేశారు. పట్టణంలోని రామన్ కాలనీ నూతన రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై ఏర్పడిన గుంతలను ఆదివారం సంస్థ సభ్యులతో కలసి పూడ్చి వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, బ్రిడ్జిపై ప్రమాదకరంగా మారిన గుంతల మూలంగా రాత్రి సమయంలో విధులకు హాజరయ్యే సింగరేణి కార్మికులు రాత్రి సమయంలో గుంతలు కనపడక ద్విచక్ర వాహనాలు గుంతల్లో పడి కార్మికులు గాయాలపాలు ఆవుతున్నారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. కార్మికులు ప్రజల ఇబ్బందు లను దృష్టిలో పెట్టుకొని బ్రిడ్జిపై గుంతలను వెంటనే పూడ్చాలని కోరారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా అధ్యక్షులు నంది పాట రాజ్ కుమార్, ఉపాధ్యక్షులు సుద్దాల ప్రభుదేవ్, కార్యదర్శి గాండ్ల సంజీవ్, సభ్యులు ఎండి జావిద్ పాషా, అబిద్, చరణ్ రాజు పాల్గొన్నారు.