నక్సల్స్‌పై అంతిమ పోరు
2026 నాటికి పూర్తిగా తుడిచిపెట్టేయాలి
ఇంటర్ స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ భేటీలో షా
న్యూఢిల్లీ, ఆగస్టు 24: దేశంలో నక్సలిజంపై అంతిమ పోరు మొదలైందని, 2026 నాటికి ఈ వేర్పాటువాదాన్ని పూర్తిగా తుడిచిపెట్టేస్తామని కేంద్ర హోంమంత్రి అమిత్ షా ప్రకటించారు. కన్సల్స్ ప్రభావిత ప్రాంత ప్రభుత్వాల ప్రధాన కార్యదర్శులు, డీజీపీలతో ఆయన శనివారం ఇంటర్ స్టేట్ కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. ‘2026 మార్చి నాటికి మన పోరాటం (నక్సలిజంపై) తుది దశకు చేరుకొంటుందని భావిస్తున్నా. కన్సలిజం నుంచి దేశాన్ని పూర్తిగా విముక్తి చేయగలమన్న నమ్మకం ఉన్నది. లెఫ్టిజం, నక్సలిజంపై కనికరం లేకుండా తుది పోరుకు సిద్ధం కావాల్సిన సమయం ఆసన్నమైంది. నక్సలైట్లు లొంగిపోయేందుకు మరింత సులభమైన విధానం అమలుచేద్దాం. కానీ, దాన్ని దుర్వినియోగం చేస్తే మాత్రం సహించం’ అని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి విష్ణుదేవ్ సాయ్ కూడా పాల్గొన్నారు.






