ముగిసిన తుదిదశ లోక్‌సభ ఎన్నికల ప్రచారం
30-05-2024 05:36 PM
న్యూఢిల్లీ: లోక్ సభ ఎన్నికల ప్రచారానికి తుదివిడుత గడువు గురువారం సాయంత్రంతో ముగిసింది. చివరి విడుతలో 57 లోక్ సభ నియోజకవర్గాలకు పోలింగ్ జరగనుంది. ఏడో విడత బరిలో మొత్తం 904 మంది అభ్యర్థులు పోటీ పడుతున్నారు. 8 రాష్ట్రాల్లోని 57 లోక్ సభ నియోజకవర్గాల్లో జూన 1న పోలింగ్ నిర్వహించనున్నారు. యూపీలో 13, పంజాబ్ 13, బెంగాల్ లో 9, బిహార్ లో 8, హిమాచల్ ప్రదేశ్ లో 4, జార్ఖండ్ లో 3, ఒడిశాలో 6, చండీగఢ్ లో ఒక లోక్ సభ స్థానికి పోలింగ్. తుది విడత పోలింగ్ లో ప్రధాని నరేంద్ర మోడీ వారణాసి నుంచి బరిలో ఉన్నారు. హిమాచల్ మండి నుంచి బాలీవుడ్ నటి కంగనా రనౌత్ పోటీ చేస్తోంది. జూన్ 4న సార్వత్రిక ఎన్నికల ఫలితాలు, ఏపీ, ఒడిశా అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడనున్నాయి.






