26 July, 2026 | 7:01 PM

లోయలో పడిన బస్సు..

31-05-2024 12:42 AM

జమ్ముకశ్మీర్‌లో ఘోర రోడ్డు ప్రమాదం 

22 మంది మృతి

శివ్ ఖోహీర్ ఆలయానికి వెళ్తుండగా ఘటన

తీవ్ర విచారం వ్యక్తం చేసిన ప్రధాని మోదీ

శ్రీనగర్, మే 30: జమ్ముకశ్మీర్‌లో గురువారం ఘోర రోడ్డుప్రమాదం సంభవించిం ది. అక్నూర్ పట్టణ సమీపంలోని తాండ ప్రాంతంలో యాత్రికుల బస్సు దాదాపు 150 అడుగుల లోతులో ఉన్న లోయలో పడటంతో 22 మంది మరణించారు. 57 మంది గాయపడ్డారు. మృతులంతా ఉత్తరప్రదేశ్‌లోని హత్రాస్‌కు చెందినవారిగా గుర్తిం చారు.

కొందరు క్షతగాత్రుల పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు చెబుతున్నారు. వీరు జమ్ము నుంచి రీసీ జిల్లాలోని శివ్ ఖోహీర్ ఆలయానికి వెళ్తున్నారు. ఈ క్రమంలో జమ్ము హైవేపై కాళీధార్ మందిర్ వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి లోయలో పడిపోయింది. ఈ ప్రమాదంలో గాయపడ్డవారిని అక్నూర్, జమ్ములోని దవాఖానలకు తరలించి చికిత్స అందిస్తున్నారు. అయితే బస్సు ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు పోలీసులు విచారణ జరుపుతున్నారు.

ప్రధాని మోదీ సంతాపం..

బస్సు లోయలో పడిన సంఘటనపై ప్రధాని నరేంద్ర మోదీ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ‘అక్నూర్ బస్సు ప్రమాదం నన్ను ఎంతగానో కలిచివేసింది. ఈ ప్రమాదంలో సొంతవారిని కోల్పోయిన కుటుంబ సభ్యులకు నా ప్రగాఢ సానుభూతి. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తు న్నాను. చనిపోయిన వారి కుటుంబసభ్యులకు రూ.2లక్షల పరిహారం అందిస్తాం. గాయపడిన వారికి రూ.50 వేలు ఇస్తాం’ అని ప్రధాని నరేంద్రమోదీ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.