29-10-2024 12:36:55 AM
పట్నా పైరేట్స్‌పై తెలుగు టైటాన్స్ విజయం
హైదరాబాద్: ప్రొకబడ్డీ లీగ్‌లో తెలుగు టైటాన్స్ హాట్రిక్ ఓటముల తర్వాత మళ్లీ గెలుపు బాట పట్టింది. సోమవారం గచ్చిబౌలి వేదికగా జరిగిన మ్యాచ్‌లో తెలుగు టైటాన్స్ 28-26 తేడాతో పట్నా పైరేట్స్ మీద విజయం సాధించింది. కెప్టెన్ పవన్ షెరావత్ పెద్దగా రాణించకున్నా కానీ టైటాన్స్ మాత్రం విజయబావుటా ఎగరేసింది.
ఆశిష్ నర్వాల్ 9 పాయింట్లతో విజయంలో కీలకపాత్ర పోషించాడు. ఇక మరో మ్యాచ్‌లో హర్యానా స్టీలర్స్ 41-34 తేడాతో దబంగ్ ఢిల్లీ మీద గెలుపొందింది. హర్యానా తరఫున స్టార్ ప్లేయర్ షాదులు 10 పాయింట్లు సాధించగా.. ఢిల్లీ ఆటగాడు అషూ మాలిక్ (13) సూపర్ టెన్ సాధించాడు.
అషూ సూపర్ టెన్ సాధించినా కానీ ఢిల్లీకి మాత్రం ఓటమి తప్పలేదు. ఢిల్లీ తురుపుముక్క కెప్టెన్ నవీన్ కుమార్ మూడంటే మూడు పాయింట్లు మాత్రమే సాధించి తీవ్రంగా నిరాశపర్చాడు. నేటి మ్యాచ్‌ల్లో బెంగాల్‌తో పునేరి పల్టన్, బెంగుళూరుతో ఢిల్లీ తలపడనున్నాయి.