29-07-2025 06:57:11 PM
రాష్ట్ర 2వ మహాసభను జయప్రదం చేయాలి..
హుజూర్ నగర్: సమాజాన్ని చైతన్యపరిచేది జర్నలిస్టులేనని ప్రభుత్వానికి ప్రజలకు మధ్య వారదులుగా ఉంటూ పలు సమస్యలు పరిష్కార దిశగా వార్తలు రాస్తున్నారని తెలంగాణ మాదిగ జర్నలిస్టుల ఫోరం రాష్ట్ర నాయకులు వస్కుల రామయ్య అన్నారు. మంగళవారం పట్టణంలో తెలంగాణ మాదిగ జర్నలిస్టు ఫోరం(Telangana Madiga Journalist Forum) రాష్ట్ర 2వ మహాసభల గోడ పత్రికను సీనియర్ జర్నలిస్టు రాం సైదులుతో కలిసి ఆవిష్కరించి మాట్లాడారు. సమాజంలో ఏ సంఘటన జరిగిన ప్రజలకు వివిధ ప్రసార మాద్యమాల ద్వారా సమాజానికి చేరవేస్తూ ప్రజల్ని చైతన్యపరచడంలో అత్యంత కీలక పాత్ర వహించేది జర్నలిస్టులే అన్నారు.
గత చరిత్ర చూస్తే మొదటి జర్నలిస్టు మాదిగేనని అన్నారు. దేశవ్యాప్తంగా జర్నలిస్టుల రక్షణకు కేంద్ర ప్రభుత్వం జాతీయ జర్నలిస్టుల భద్రత చట్టం తీసుకురావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. అక్రిటిడేషన్ కమిటీలో మాదిగ జర్నలిస్టు ఫోరం ప్రతినిధులకు ప్రాధాన్యత కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వం జర్నలిస్టులకు ఇంటి స్థలాలు,హెల్త్ కార్డులు మంజూరు చేయాలని రాష్ట్ర స్థాయిలో జాతీయస్థాయిలో నూతన మీడియా పాలసీని ప్రభుత్వం ప్రకటించి జర్నలిస్టులను ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో పలువురు జర్నలిస్టులు పాల్గొన్నారు.