calender_icon.png 30 July, 2025 | 6:59 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

యువత పరిశ్రమల స్థాపనకు ముందుకురావాలి

29-07-2025 06:32:41 PM

పరిశ్రమల శాఖ జిల్లా జనరల్ మేనేజర్ బి. నవీన్ కుమార్..

హనుమకొండ (విజయక్రాంతి): నిరుద్యోగ యువకులు ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూడకుండా చిన్న భారీ పరిశ్రమలను స్థాపించేందుకు ముందుకురావాలని జిల్లా పరిశ్రమల శాఖ హనుమకొండ జిల్లా జనరల్ మేనేజర్ బి. నవీన్ కుమార్(Industries Department General Manager Naveen Kumar) ఆశాభవాన్ని వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు బ్యాంకుల ఆమోదంతో సబ్సిడీ అందిస్తుందన్నారు. నిరుద్యోగ యువత అందిపుచ్చుకోవాలని చిన్న, భారీ పరిశ్రమల స్థాపించి మరి కొంతమంది నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించాలని వారు యువతను కోరారు.

జిల్లాలోని 14 మండలాల్లో 1139 చిన్న భారీ పరిశ్రమలు ఉన్నాయని ఆగ్రో బేస్ కోల్డ్ స్టోరేజీ, సిమెంట్ బ్రిక్స్ తయారీ, ఎలక్ట్రికల్ ప్రొడక్ట్స్, పేపర్ ప్లేట్స్ పరిశ్రమ, సోలార్ పరిశ్రమలు, వుడ్ అండ్ లెదర్, గ్రానైట్ పరిశ్రమ, ఫుడ్ ప్రాసెసర్ సింగ్ ప్రొడక్ట్స్ తదితర పరిశ్రమలను స్థాపించేందుకు కేంద్ర ప్రభుత్వం సబ్సిడీతో కూడిన బ్యాంకు రుణాలను సద్వినించుకోవాలని పరిశ్రమలను స్థాపించి ఉపాధి పొంది ఆర్థికంగా బలపేతం చెందాలని కోరారు. ఉన్నత చదువులతో పాటు పరిశ్రమ స్థాపనకు నడుంబిగించాలని ఆయన పిలుపునిచ్చారు. పరిశ్రమల యజమానులకు బ్యాంకర్లతో ఏర్పడే సమస్యల పరిష్కారానికి పరిశ్రమల మంజూరుకు కావలసిన అర్హతలు, విద్యార్హత దీన్ని యువత విద్యా అర్హత లేని యువతకు అనుసంధానంగా పరిశ్రమల శాఖతో పాటు సమస్యల పరిష్కరించడానికి కృషి చేయడంతో పాటు యువత ఆర్థికంగా ఎదిగేందుకు పరిశ్రమలు స్థాపించేందుకు అనుసంధానంగా వ్యవహరిస్తుందని జనరల్ మేనేజర్ అన్నారు.