calender_icon.png 30 July, 2025 | 5:13 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

పల్లవి మోడల్ స్కూల్ లో నాయకులుగా విద్యార్థులు

29-07-2025 06:24:33 PM

ముఖ్యఅతిథిగా కెప్టెన్ సాయికుమార్

మేడిపల్లి: బోడుప్పల్ పల్లవి మోడల్ స్కూల్(Pallavi Model School)లో విద్యార్థి నాయకుల ఎన్నిక అధికార సేకరణ కార్యక్రమాన్ని మంగళవారం రోజున నిర్వహించారు. పాఠశాలకు విద్యార్థి నాయకులను ఎన్నుకున్నారు. ఈ సందర్భముగా ముఖ్య అతిథులు సాయి కుమార్ మాట్లాడుతూ, ముందుగా విద్యార్థి నాయకులను అభినందించి, వ్యక్తిత్వాన్ని పెంపొందించుకునేలా ఉండాలని తెలిపారు. మంచి అలవాట్లను అలవరుచుకోవటం వలన అనుకున్న లక్ష్యాన్ని సాధించగలమని తెలియజేశారు. అంతేకాక ముఖ్యంగా విద్యార్థులు నడుచుకోవలసిన ముఖ్య విషయాలను ఆయన తెలియజేశారు. ప్రత్యేక ఆహ్వానితురాలు లక్ష్మి అన్నపూర్ణ చింతలూరి మాట్లాడుతూ, ప్రతి విద్యార్థి చదువు, క్రమశిక్షణ మంచి మార్గంలో వెళ్ళేలా పాటుపడాలని, విద్యార్థులు తమను తాము తక్కువ అంచనా వేసు కోకూడదన్నారు. పెద్దలు కూడా పిల్లలను చూసి నేర్చుకునేలా తయారవ్వాలని తెలిపారు.

విద్యార్థి నాయకులుగా తీసుకున్న బాధ్యతలో ఎంతో విలువ ఉందని తెలియజేశారు. ఈ సందర్భముగా పాఠశాల డైరెక్టర్ సుశీల్ కుమార్ మాట్లాడుతూ నాయకులు ఎప్పుడూ కూడా ఇంకొకరికి ఆదర్శంగా ఉండేలాగ నడుచుకోవాలని, మనలో మంచి అలవాట్లను రూపొందించుకోవాలని ఆయన తెలియజేశారు. విద్యార్థులు అన్ని రంగాలలో అభివృద్ధి సాధించటానికి తమ వంతు సహకారాన్ని అందిస్తామని వారు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో కెప్టెన్ సాయి కుమార్, లక్ష్మి అన్నపూర్ణ చింతలూరి,పాఠశాల డైరెక్టర్ సుశీల్ కుమార్, పాఠశాల ప్రిన్సిపల్ తనూజ, విద్యార్థుల తల్లిదండ్రులు, విద్యార్థులు  తదితరులు పాల్గొన్నారు.