calender_icon.png 30 July, 2025 | 7:01 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ప్రభుత్వ హాస్పిటల్ ను 30 పడకల హాస్పిటల్ గా మార్చాలి

29-07-2025 06:41:04 PM

సీజనల్ వ్యాధులను అరికట్టాలని ధర్నా..

నూతనకల్ (విజయక్రాంతి): ప్రభుత్వ ఆసుపత్రుల్లో మౌలిక సదుపాయాలు కల్పించి, 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని, సీజనల్ వ్యాధులను అరికట్టాలని పివైఎల్ జిల్లా కోశాధికారి బండి రవి(PYL District Treasurer Bandi Ravi) డిమాండ్ చేశారు. మంగళవారం మండల కేంద్రంలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. వర్షాలు ప్రారంభం కావడంతో సీజనల్ వ్యాధులతో గ్రామాలలో టైఫాయిడ్, మలేరియా జ్వరాలు తదితర అంటువ్యాధులతో ప్రజల అవస్థలు పడుతున్నారని దీనిపై రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకొని గ్రామాల్లో మెడికల్ క్యాంపులు నిర్వహించాలని కోరారు.

ప్రభుత్వ హాస్పిటల్ పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయని, దీనితో ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తూ లక్షల రూపాయలు ఖర్చు చేసుకుంటున్నారని అయినా ప్రాణాలు నిలబడటం లేదని, ప్రజల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వ హాస్పిటల్లో మౌలిక సదుపాయాలు మెరుగుపరిచి, 30 పడకల ఆసుపత్రిగా మార్చాలని, అదనపు డాక్టర్లు నియమించి, 24 గంటలు వైద్యం అందుబాటులో ఉండే విధంగా చర్యలు చేపట్టాలని, నూతనకల్ ఆస్పత్రిలో రాత్రిపూట నైట్ వాచ్ మెన్ ను నియమించాలని, రాత్రిపూట స్టాప్ నర్స్ ఉండాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ ఆసుపత్రిలో సమస్యల పరిష్కరించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమాలు నిర్వహిస్తామని ప్రభుత్వాన్ని  హెచ్చరించారు.ఈ కార్యక్రమంలో  పి వై ఎల్ నాయకులు  పులుసు మహేష్, పంతం శ్రీను, గడ్డం పాపయ్య,రవి, వెంకన్న,శృతి, హాసన్, ఏఐకేఎంఎస్ జిల్లా నాయకులు దాసరి శ్రీనివాస్, ఐ ఎఫ్ టి యు జిల్లా సహాయ కార్యదర్శి దేశోజు మధు తదితరులు పాల్గొన్నారు.