29-07-2025 06:47:43 PM
సినారె జయంతి సందర్భంగా చిత్రపటానికి పూల మాలలు, నివాళులు..
కామారెడ్డి అర్బన్ (విజయక్రాంతి): తెలంగాణ రచయితల వేదిక ఆధ్వర్యంలో కామారెడ్డిలో మంగళవారం ఘనంగా సినారె జయంతి కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా తెలంగాణ రచయితల వేదిక సంఘ అధ్యక్షుడు గఫూర్ శిక్షక్ మాట్లాడుతూ... తెలంగాణ గర్వించదగ్గ మహాకవి సినారె అని అన్నారు. సినారె ప్రతి రచనలోనూ ప్రకృతి పెనవేసుకొని ఉంటుందని వర్ణనలు, ఆకట్టుకుంటూ సాగుతాయని అన్నారు. యువతరానికి సినారే కవిత్వం ఎంతో ఆదర్శమని తెలిపారు. జ్ఞానపీఠ అవార్డు గ్రహీత డాక్టర్ సినారె జయంతిని కామారెడ్డి లోని కర్షక్ బీఈడీ కళాశాలలో తెరవే ఆధ్వర్యంలో నిర్వహించారు. సినారె చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా కవి సమ్మేళనం నిర్వహించారు.
గఫూర్ శిక్షక్ మాట్లాడుతు, సినారె రాసిన విశ్వంభర జ్ఞానపీఠ పురస్కారాన్ని అందుకొని తెలంగాణ ప్రాంతానికి ఎంతో కీర్తి గౌరవాన్ని సంపాదించి పెట్టారన్నారు. సినారె రచనలు చైతన్య ప్రతీకలనీ ఆయన జీవితం ఎంతో మంది యువ కవులకు ఆదర్శమని సినారె రచనలను అధ్యయనం చేయాల్సిన అవసరం ఉన్నదన్నారు. నా ఇంటిపేరు చైతన్యం కవిత్వం నా మాతృభాషగా ప్రకటించుకున్న మహాకవి సినారె ఎన్నో ప్రక్రియలు తన ప్రతిభను చాటి అందరినీ మెప్పించారనీ ఆన్నారు. ఎన్నో పదవులను అలంకరించి తెలంగాణ గర్వించే విధంగా సాహిత్య సృజన చేసిన మహనీయుడు సినారె అని అన్నారు.అనంతరం నిర్వహించిన కవి సమ్మేళనం కార్యక్రమంలో కవులు, కవిత గానాలు చేశారు, సినారె రాసిన పాటలను పాడి వినిపించారు, ఈ కార్యక్రమంలో కవులు, లింగ నాగభూషణం, సుధాకర్, సాయి ప్రభ, బాల రాజయ్య, చంద్రకాంత్, సంధ్య తదితరులు పాల్గొన్నారు.