29-07-2025 06:54:10 PM
మేడ్చల్ (విజయక్రాంతి): మేడ్చల్ లో నాగుల పంచమి(Nag Panchami) భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి మహిళలు పాముల పుట్టల వద్దకు వెళ్లి పాలు పోశారు. వినాయక నగర్ కాలనీలోని ఎల్లమ్మ టెంపుల్ లో వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తీర్థ ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ అధ్యక్షుడు వేముల శ్రీనివాసరెడ్డి, ప్రధాన కార్యదర్శి పాండు గుప్త, ఉపాధ్యక్షులు ప్రతాప్, శైలేందర్, సభ్యులు టైలర్ రాజు గౌడ్, సాంబమూర్తి, పున్నారావు, లింగం, శ్రీనివాస్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.