calender_icon.png 1 February, 2026 | 12:54 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టిన ఆర్థిక మంత్రి

01-02-2026 11:49:01 AM

న్యూఢిల్లీ: 2026-27 ఏడాదికి సంబంధించిన బడ్జెట్‌ను కేంద్ర ఆర్థికశాఖ మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం లోక్ సభలో ప్రవేశపెట్టారు. ఇవాళ ఉదయం 11 గంటలకు మంత్రి నిర్మలా సీతారామన్ తన తొమ్మిదవ బడ్జెట్‌ను లోక్ సభలో సమర్పించారు. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత దేశ వార్షిక పద్దును ఆదివారం ప్రవేశపెట్టడం ఇదే మొదటిసారి. ఈ బడ్జెట్‌లో వృద్ధి వేగాన్ని కొనసాగించడానికి, ఆర్థిక క్రమశిక్షణను పాటించడానికి, అలాగే అమెరికా సుంకాలతో సహా ప్రపంచ వాణిజ్య ఘర్షణల నుండి ఆర్థిక వ్యవస్థను కాపాడే సంస్కరణలను ప్రకటించే అవకాశం ఉంది.

దీనితో సీతారామన్, వివిధ కాలాల్లో మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ ప్రవేశపెట్టిన 10 బడ్జెట్ల రికార్డుకు మరింత చేరువయ్యారు. దేశాయ్ 1959 నుండి 1964 వరకు ఆర్థిక మంత్రిగా ఉన్న కాలంలో ఆరు బడ్జెట్లను, 1967 నుండి 1969 మధ్య నాలుగు బడ్జెట్లను ప్రవేశపెట్టారు. వరుసగా తొమ్మిదో బడ్జెట్‌ను ప్రవేశపెట్టడానికి ముందు స్థాపిత సంప్రదాయం ప్రకారం ఆర్థిక మంత్రి తన బృందంలో కలిసి రాష్ట్రపతి భవన్ కు చేరుకొని రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. అనంతరం బడ్జెట్ పత్రాలను రాష్ట్రపతికి అందజేశారు. బడ్జెట్ ప్రవేశపెట్టనున్న సందర్భంగా రాష్ట్రపతి కేంద్ర ఆర్థిక మంత్రికి, ఆమె బృందానికి శుభాకాంక్షలు తెలిపి వారికి మిఠాయి తినిపించారు. దేశ వార్షిక బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదించడంతో ఉదయం 11 గంటలకు మంత్రి లోక్ సభలో ప్రవేశపెట్టారు.