01-02-2026 03:22:56 AM
సెంట్ థెరిసా హాస్పిటల్‌లో ల్యాపరాస్కోపిక్ హెర్నియా చికిత్సపై వర్క్‌షాప్
హైదరాబాద్, జనవరి 31 (విజయక్రాంతి): ఎర్రగడ్డలోని సెంట్ థెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్‌లో అడ్వాన్స్‌డ్ ల్యాపరాస్కోపిక్ హెర్నియా లైవ్ వర్క్‌షాప్‌ను పూర్తి రోజు అకడమిక్ కార్యక్రమంగా నిర్వహించారు. ఈ వర్క్‌షాపులో తెలంగాణతో పాటు పొరుగు రాష్ట్రాల నుంచి సుమారు 100 మంది సర్జన్లు, వైద్య నిపుణులు పాల్గొన్నారు. ఈ ప్రతిష్ఠాత్మక అకడమిక్ ప్రోగ్రామ్‌కు నేషనల్ చాప్టర్ ఆఫ్ అఫి (ఏపీహెచ్‌ఐ), అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) తెలంగాణ చాప్టర్ మద్దతు అందించాయి.
వర్క్‌షాపులో భాగం గా పలు లైవ్ ల్యాపరాస్కోపిక్ హెర్నియా సర్జరీలు నిర్వహించబడ్డాయి. డా.రమేష్ ధర్మవ రం నిర్వహించిన ల్యాపరాస్కోపిక్ టాప్ప్ (టీఏపీపీ) ఇంగుయినల్ హెర్నియా శస్త్రచికిత్స ద్వారా శరీర నిర్మాణ ల్యాండ్మారక్స్, శస్త్రచికిత్సా విధానాలపై అవగాహన కల్పించారు. డా రాజేంద్ర ల్యాపరాస్కోపిక్ హెర్నియా శస్త్రచికిత్సలో అనాటమికల్ ల్యాండ్‌మార్క్స్, క్రిటి కల్ వ్యూ అంశంపై నిపుణుల అకడమిక్ సెషన్ నిర్వహించారు. మరో కీలక లైవ్ డెమోగా డా. టి. వరుణ్ రాజు నిర్వహించిన ల్యాపరాస్కోపిక్ వెంట్రల్ హెర్నియా రిపేర్ శస్త్రచికిత్స, క్లిష్టమైన హెర్నియా కేసుల నిర్వహణలో ఆధునిక పద్ధతులను ప్రదర్శించింది.
డా. మిలింద్ కొండవర్ మెష్ సైన్స్, ఫిక్సేషన్ పద్ధతులు, దీర్ఘకాలిక ఫలితాలు అనే అంశంపై ఆధారాలతో కూడిన లెక్చర్ అందించారు. డా. సి. ఆర్. కె. ప్రసాద్ నిర్వహించిన ల్యాపరాస్కోపిక్ ఐపో మ్+ హెర్నియా రిపేర్ శస్త్రచికిత్స ద్వారా ఖచ్చితత్వం, భద్రత, సంక్లిష్టతల నివారణపై దృష్టి సారించారు. డా. విజయ్ భార్గవ ల్యాపరాస్కోపిక్ హెర్నియా శస్త్రచికిత్సలో సంక్లిష్టతల నివా రణ, నిర్వహణ అంశంపై ప్రత్యేక లెక్చర్ ఇచ్చా రు.
ఆధునిక హెర్నియా శస్త్రచికిత్సలో నిర్ణయా లు ఓపెన్ వర్సెస్ ల్యాపరాస్కోపిక్ వర్సెస్ రోబోటిక్ అనే అంశంపై ప్యానెల్ చర్చ జరిగింది. ఈ చర్చలో డా.సురేంద్ర జాస్తి, డా. సురేష్, డా.అస్లాం బాబా, డా.రమేష్ ధర్మవరం పాల్గొని తమ అనుభవాలు, క్లినికల్ అభిప్రాయాలను పంచుకున్నారు. కార్యక్రమం లో పాల్గొన్న వైద్యులకు సర్టిఫికెట్లు అందజేయగా, అనంతరం వాలెడిక్టరీ సెషన్, ధన్య వాద ప్రసంగంతో ముగిసింది.
సెంట్ థెరిసా మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అడ్మినిస్ట్రేటర్ సిస్టర్ ఆర్ నిర్మల మాట్లాడు తూ.. అకడమిక్ ఉత్తమత, ఆధునిక వైద్య శిక్షణకు సెంట్ థెరిసా హాస్పిటల్ ఎల్లప్పుడూ ప్రాధాన్యం ఇస్తోంది. ఇలాంటి సమగ్ర వర్క్‌షాపుల నిర్వహణ నాణ్యమైన వైద్య సేవల పట్ల మా నిబద్ధతకు నిదర్శనం’ అన్నారు. మెడికల్ సూపరింటెండెంట్ డా. ఎన్.వి.ఆర్. మూర్తి మాట్లాడుతూ.. లైవ్ సర్జరీలతో కూడిన హ్యాండ్స్-ఆన్ వర్క్‌షాపులు వైద్యుల నైపుణ్యాల అభివృద్ధికి ఎంతో ఉపయుక్తంగా ఉంటాయన్నారు. ఆర్గనైజింగ్ చైర్మన్ డా. టి. వరుణ్ రాజు మాట్లాడుతూ.. ఆధునిక ల్యాపరాస్కోపిక్ హెర్నియా శస్త్రచికిత్సా పద్ధతులపై ప్రాక్టికల్ అవగాహన కల్పించడమే ముఖ్య ఉద్దేశం అన్నారు.
ఈ వర్క్‌షాపును డా. టి. వరుణ్ రాజు (ఆర్గనైజింగ్ చైర్మన్), డా. లలిత కరణం (ఆర్గనై జింగ్ డైరెక్టర్), డా. వై. భాస్కర్ రెడ్డి (ఆర్గనైజింగ్ సెక్రటరీ) ఆధ్వర్యంలో నిర్వహించగా, పలువురు జాతీయ, రాష్ట్ర స్థాయి శస్త్రచికిత్స నిపుణులు మార్గదర్శకత్వం వహించారు. డాల్ఫిన్ స్యూటర్స్, హెల్తియం, అలోన్సోవా లైఫ్ సైన్సెస్ స్పాన్సర్లుగా వ్యవహరించారు.