1 August, 2026 | 1:06 AM

గాయపడ్డ ఎమ్మార్పీఎస్ ప్రతినిధికి ఆర్థిక సాయం

01-08-2026 12:00 AM

రూ.5 వేలు అందజేసిన బకరం శ్రీనివాస్ మాదిగ 

నల్గొండ టౌన్, జూలై 31 : హాలియా మండలం కొత్తపల్లికి చెందిన ఎమ్మార్పీఎస్, ప్రతినిధి గార్లపాటి ప్రసాద్ మాదిగను శుక్రవారం ఏంఎస్పి నాయకులు పరామర్శిం చారు. రూ.5వేల ఆర్థిక సహాయం చేశారు.గో టు విలేజ్ కార్యక్రమంలో భాగంగా అనుముల గ్రామానికి వెళ్లి తిరిగి వస్తుండగా బైక్ స్కిడ్ అయి కిందపడటంతో అయన కుడి భుజం ఫ్రాక్చర్ అయింది. ఎమ్మెస్పీ నల్లగొండ జిల్లా మాజీ అధ్యక్షులు బకరం శ్రీనివాస్ మాదిగ బాధితుడిని కలిసి ధైర్యం చెప్పి ఆర్థిక సాయం అందజేశారు. బొజ్జ చిన్న మాదిగ, రాంబాబు, సైదీష్, విజయ్, వెంకన్న, రాజీవ్, శేఖర్ తదితరులు ప్రసాద్ ను పరామర్శించారు.