1 August, 2026 | 1:07 AM

ఘనంగా అన్నాభిషేకం

01-08-2026 12:00 AM

మేళ్లచెరువు, జూలై 31 : స్థానిక శ్రీ స్వయంభూ శంభు లింగేశ్వర స్వామి వారి దేవస్థానంలో శుక్రవారం పర్వదిన సందర్భంగా పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ప్రత్యేక అభిషేకము, మహాన్యాస పూర్వక రుద్రాభిషేకం, అన్నాభిషేకం, తదితర పూజా కార్యక్రమాలు ఘనంగా జరిగాయి. ఇష్టకామేశ్వరి అమ్మవారికి పంచామృతాభిషేకాలు వైభవంగా జరిపారు. ఈ పూజ కార్యక్రమాల్లో దేవదాయ శాఖ ఇంజనీరింగ్ విభాగం డి ఈ ఓం ప్రకాష్, ఏఈ  కిరణ్ కుమార్, కాంగ్రెస్ మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్ రెడ్డి, ఈవోలు ఎన్ శంబిరెడ్డి, గుజ్జుల కొండారెడ్డి, లక్ష్మణరావు, కె.కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు.