calender_icon.png 12 November, 2025 | 2:09 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అంత్యక్రియలకు ఆర్థిక సహాయం

12-11-2025 12:00:00 AM

ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేసిన ఎమ్మెస్సార్ 

హన్వాడ, నవంబర్ 11: మండలంలోని మునిమోక్షం గ్రామ పరిధిలోని తువ్వగడ్డ తండాకు చెందిన కట్రావత్ రమేష్ ఆకస్మాత్తుగా మరణించారు.  ఈ విషయాన్ని స్థానిక  కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా తెలుసుకున్న మారేపల్లి సురేందర్ రెడ్డి  ప్రగాఢ సానుభూతి తెలియజేసారు, ఎమ్మెల్యే శ్రీ యెన్నం శ్రీనివాస్ రెడ్డి సూచన మేరకు    మహబూబ్ నగర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు మరేపల్లి సురేందర్ రెడ్డి మృతుడి అంత్యక్రియల నిమిత్తం రూ 10 వేల ఆర్థిక సహా యాన్ని  వారి కుటుంబ సభ్యులకు కాంగ్రెస్ పార్టీ నాయకుల ద్వారా అందజేశారు. 

హన్వాడ మండల కాంగ్రెస్ పార్టీ కో ఆర్డినేటర్ వేంకటయ్య, గ్రామ అధ్యక్షుడు బి.మల్లేష్, ఏరోళ్ల కిష్టయ్య, శ్రీనివాసులు మోహన్, విఠల్, చందర్ నాయక్, సంతోష్, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.