31 August, 2026 | 3:52 AM

ఆడబిడ్డల పెండ్లికి ఆర్థిక సాయం

31-08-2026 02:10 AM

రాజాపూర్ ఆగస్టు 30: మండల కేంద్రనికి చెందిన మంగలి కృష్ణయ్య కూతురు రాధిక మల్లెపల్లి గ్రామానికి చెందిన మల్లయ్య కూతురు మహేశ్వరి  వివాహానికి టిఆర్‌ఎస్ పార్టీ యువ నాయకుడు అభిమన్యు రెడ్డి రూ.10 వేల చొప్పున ఆర్థిక సహాయం ప్రకటించారు.

ఆదివారం అభిమన్యు  యువసేన నాయకులు వివాహ వేడుకలకు హాజరై పెండ్లి కూతుర్లకు ఆర్థిక సాయం అందజేశారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ రామకృష్ణ, ఉప సర్పంచ్ రేష్మ నజీమ్ బేగ్, వార్డు మెంబర్ రాచమల్ల యాదగిరి, మంగలి యాదగిరి, సలీం, లింగం, రామకృష్ణ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.