11 April, 2026 | 4:18 AM

17వ వార్డులో ఆడబిడ్డ పెళ్లికి ఆర్థిక సహాయం అందజేత

11-04-2026 02:20 AM

బాన్సువాడ, ఏప్రిల్ 10 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా బాన్సువాడ పట్టణం లో మున్సిపల్ ఎన్నికల్లో 17వ వార్డు కౌన్సీలర్ ఫరా నాజ్ మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తున్న సమయంలో తాను ఇచ్చిన హామీలలో ప్రతి ఆడ బిడ్డ పెళ్లికు సంబంధించి తన వంతు  సహకారం ఆర్థిక సహాయం అందిస్థానాని ఇచ్చిన మాట ప్రకారం శుక్రవారం  17 వార్డు కు సంబంధించి  డబల్ బెడ్ రూమ్ కాలనీ లో నివసిస్తున్న ఓ పేద కుటుంబంలో చాకలి నాగమణి  సాయిలు కుమార్తె అనూష పెళ్లి కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. 17 వార్డు కౌన్సిలర్ ఫర్హానాజ్ అబ్దుల్ లాయక్ ఇంటికి వెళ్లి ఒక క్వింటాల్ బియ్యం,కిరణ కొరకు రూ.5000 నగదు ఆర్థిక సహాయం అందచేశారు.ఈ కార్యక్రమంలో ఎం.ఐ.ఎం. పార్టీ అధ్యక్షులు సయీద్ ఖాన్, నేతలు అంజాద్ ఖాన్, హాశం,రసూల్, అస్లాం, ఐజాజ్, సుభాన్, అబ్దుల్ హఫీజ్ వార్డు సభ్యులు పాల్గొన్నారు.