29 June, 2026 | 12:58 AM

తోటి మిత్రుడి కుటుంబానికి ఆర్థిక సాయం

29-06-2026 12:24 AM

సంస్థాన్ నారాయణపూర్, జూన్ 28 : ఇటీవల అనారోగ్యంతో మరణించిన బాల్య మిత్రుడి కుటుంబానికి తోటి మిత్రులు అండగా నిలిచారు. మండలంలోని కంకణాలగూడెం గ్రామానికి చెందిన రమేష్ మృతితో ఆ కుటుంబం ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్న విషయాన్ని తెలుసుకున్న 2001-2002 సంవత్సరం పదవ తరగతి విద్యార్థులు తమవంతు సాయంగా 30 వేల రూపాయలను ఆయన కుటుంబ సభ్యులకు అందజేశారు. అనంతరం పలువురు మాట్లాడుతూ ఎల్లప్పుడూ రమేష్ కుటుంబానికి అండగా ఉంటామని భరోసానిచ్చారు. తోటి మిత్రుని కుటుంబానికి నాటి విద్యార్థులంతా చేతులు కలిపి ఆర్థికసాయం చేయడంతో స్థానికులు అభినందిస్తున్నారు.