29 June, 2026 | 12:58 AM

సీఎం పర్యటన ఏర్పాట్లు పరిశీలించిన మంత్రి తుమ్మల

29-06-2026 12:23 AM

ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలని అధికారులకు ఆదేశం

చింతకాని, జూన్ 28(విజయక్రాంతి): ఈనెల 30వ తేదీన చింతకాని మండలం జగన్నాధపురం గ్రామములో జరుగుతున్న రైతు ఆశీర్వాద సభ ఏర్పాట్లను  రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆదివారం మధ్యాహ్నం పరిశీలించారు. ఈ రైతు ఆశీర్వాద సభకు రాష్ట్రవ్యాప్తంగా రైతులు భారీ సంఖ్యలో హాజరవుతున్న నేపథ్యంలో ఎటువంటి లోటుపాట్లు జరగకుండా రాష్ట్ర మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అధికారులకు ఆదేశించారు. దాంతోపాటు రానున్న ఈ రెండు మూడు రోజుల్లో వర్షాలు వస్తాయని వాతావరణ శాఖ తెలపటంతో ఈ ఆశీర్వాద సభకు వచ్చే రైతులుకు ఎలాంటి ఇబ్బందులు కలక్కుండా చూడాలని మంత్రి  జిల్లా ఉన్నతాధికారులను ఆదేశించారు.

సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసినటువంటి పార్కింగ్ ఇతర సౌకర్యాలపై మంత్రి తుమ్మల అధికారులు నుంచి సమాచారాన్ని అడిగి తెలుసుకున్నారు. ఈ ఆశీర్వాద సభ ఏర్పాట్లను మంత్రి తుమ్మల తో పాటు వైరా అసెంబ్లీ నియోజకవర్గం శాసనసభ్యుడు మాలోతు రాందాసు నాయక్, రాష్ట్ర కార్పొరేషన్ చైర్మన్ రాయల నాగేశ్వరరావు, సుడా చైర్మన్ పువ్వాళ్ళ దుర్గాప్రసాద్, ఖమ్మం జిల్లా డీసీసీ అధ్యక్షుడు నూతి సత్యనారాయణ గౌడ్ తో పాటు రాష్ట్ర ఉమ్మడి ఖమ్మం కాంగ్రెస్ నాయకులు తో పాటు ఖమ్మం జిల్లా ఉన్నతాధికారులు వ్యవసాయ శాఖ అధికారులు ఉన్నారు.