16-07-2025 11:45:50 PM
మందమర్రి,(విజయక్రాంతి): నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తికి ఆరోగ్యకరచుల కోసం యూత్ ఫర్ సొసైటీ సభ్యులు కాంగ్రెస్ నాయకులుబుదవారం సంయుక్తంగా ఆర్థిక సహాయం అందజేశారు. పట్టణంలోని 3వ జోన్ రామాలయం గుడి పక్కన నివాసముండే హనుమాండ్ల శ్రీనివాస్ నిరుపేద కుటుంబానికి చెందిన వ్యక్తి వృత్తి రీత్యా టైలర్ పని చేస్తూ జీవిస్తున్నాడు. నిరుపేద కుటుంబం కావడం దీనికి తోడు ఇటీవల కుడి చెయ్యి కుడికాలు పక్షవాతం రావడం తో పూర్తిగా మంచానికి పరిమితమై లేవ లేని పరిస్థితిలో ఉన్నాడు.
వైద్య ఖర్చులకు హాస్పిటల్ కి వెళ్లలేని దుస్థితిలో ఉండగా స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న యూత్ ఫర్ సొసైటీ సంస్థ సభ్యులు స్పందించి రూ.55,000 పట్టణ కాంగ్రెస్ నాయకులు రూ.5,000 కలిసి బాధితునికి మొత్తం10,000 రూ.ఆర్థిక సహాయం అందించారు. దాతలు ముందుకు వచ్చి ఆర్థిక సహాయం అందించి నిరుపేద కుటుంబానికి అండగా నిలవాలని సంస్థ సభ్యులు కోరారు.