calender_icon.png 17 July, 2025 | 10:41 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి

17-07-2025 12:00:00 AM

జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్

జగిత్యాల అర్బన్, జూలై 16(విజయ క్రాంతి): వివిధ పథకాల కింద చేపట్టిన అభివృద్ధి పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ సత్యప్రసాద్ అన్నారు.జగిత్యాల జిల్లా మల్లాపూర్ మండలం సిరిపూర్, సాతారం గ్రామాలలో ఆయుష్మాన్ భారత్ ఆరోగ్య మందిరం నిర్మాణ పనులను, నేషనల్ హెల్త్ మిషన్, ఎన్ హెచ్ ఎం నిధులతో ఒక భవనంకు 20 లక్షల తో నిర్మిస్తున్న నూతన భవనాల నిర్మాణ పనులు,

ఆయుష్మాన్ ఆరోగ్య మందిరం భవనంలో పనులను, సిర్పూర్ గ్రామంలో గ్రామపంచాయతీ భవన నిర్మాణ పనులను రు.20 లక్షల ఈజీఎస్ నిధులతో నిర్మిస్తున్న భవన నిర్మాణ పనులను జిల్లా కలెక్టర్ బి. సత్యప్రసాద్ పరిశీలించారు.ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నేషనల్ హెల్త్ మిషన్ ఒక భవనంకు రు.20 లక్షల నిధులతో ఆయుష్మాన్ ఆరోగ్యం మందిరం భవనం,

సిర్పూర్ గ్రామ పంచాయతీ భవనం నిర్మాణ పనులను పరిశీలించి పనులను వేగవంతంగా పూర్తి చేయాలని పెండింగ్ పనులు ఉన్నట్లయితే వేగవంతంగా పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు. ప్లంబింగ్,వాటర్ ట్యాబ్,డోర్స్,వాష్ రూమ్ పెండింగ్ ఉన్నట్లయితే పూర్తి చేసుకోవాలని ఈనెల ఆఖరు లోపు పూర్తి చేసుకోవాలని అధికారులను ఆదేశించారు.

కలెక్టర్ వెంట మెట్పల్లి రెవెన్యూ డివిజనల్ అధికారి శ్రీనివాస్, ఈ పి ఆర్ ఓ లక్ష్మణరావు, హౌసింగ్ పిడి ప్రసాద్, తహసిల్దార్ రమేష్.ఎంపీడీవో శశి కుమార్ రెడ్డి సంబంధిత అధికారులు పాల్గొన్నారు.