వన మహోత్సవం సందర్భంగా మొక్కలు నాటిన అధికారులు, ప్రజాప్రతినిధులు
దోమకొండ, ఆగస్టు 25 (విజయక్రాంతి): పర్యావరణ పరిరక్షణ, పచ్చదనం పెంపొందించడమే లక్ష్యంగా దోమకొండ గ్రామ రైతువేదికలో మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల స్పెషల్ ఆఫీసర్ జ్యోతి, ఎంపీడీవో మధురిమ కార్యక్రమంలో పాల్గొని మొక్కలు నాటారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత తీసుకోవాలని సూచించారు.
మొక్కల పెంపకంతో పర్యావరణ సమతుల్యతను కాపాడుతూ భావితరాలకు పచ్చని భవిష్యత్తును అందించవచ్చని తెలిపారు. నాటిన ప్రతి మొక్కను సంరక్షించేలా ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. మొక్కలను నాటి వదిలేయకుండా వాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నప్పుడే వన మహోత్సవం లక్ష్యం నెరవేరుతుందని పేర్కొన్నారు.పచ్చదనం పెంపొందించడం ద్వారా ఆరోగ్యకరమైన, ఆహ్లాదకరమైన వాతావరణాన్ని నిర్మించవచ్చని తెలిపారు.
రైతువేదిక పరిసరాల్లో నాటిన మొక్కల సంరక్షణపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. దోమకొండ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘం (పి ఎ సి ఎస్) ఆవరణలోనూ మంగళవారం వన మహోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా సహకార అధికారి (డీసీఓ) రామ్మోహన్ హాజరై మొక్కలు నాటారు.
మొక్కల సంరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ అధికారి మణిదీపిక, నీటిపారుదల శాఖ ఏఈ, ఉప సర్పంచ్, వార్డు సభ్యులు, ఐకేపీ ఏపీఎం, టీఏ, ఎఫ్ ఏ, వీ ఓ సభ్యులు, సి ఎ లు, ప్రజాప్రతినిధులు, వేజ్ సీకర్స్ తదితరులు పాల్గొన్నారు.
నసురుల్లాబాద్ మండలంలో..
నసురుల్లాబాద్. ఆగస్టు 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా నసురుల్లాబాద్ మండలంలో ఎంపీడీవో తాసిల్దార్ ఆధ్వర్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు వన మహోత్సవ కార్యక్రమం నిర్వహించడం జరిగింది ఎంపీడీవో.తాసిల్దార్ మొక్కలు నాటినారు ప్రతి ఒక్కరూ గ్రామంలో మొక్కలను నాటాలని ప్రకృతి పర్యావరణాన్ని కాపాడాలని ఆదేశించినారు
ఈ కార్యక్రమంలో ఎంపీడీవో k. రవిశ్వర్ గౌడ్. తాసిల్దార్ సువర్ణ. ఎం ఈ ఓ చందర్ నాయక్. డాక్టర్ ఎం సి హెచ్ సౌజన్య. గిర్ధవార్ వెంకటరమణ. ఎంపీ ఓ సౌజన్య టెక్నికల్ అసిస్టెంట్ ఫీల్ అసిస్టెంట్ వివిధ శాఖల సిబ్బంది. సర్పంచ్ శంకర్ నాయక్. ఉప సర్పంచ్ చౌదరి బాబు. గ్రామ ప్రజలు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు
గాంధారి మండలంలో..
గాంధారి, ఆగస్టు 25 (విజయ క్రాంతి): కామారెడ్డి జిల్లా గాంధారి మండలంలో మంగళవారం నాడు వన మహోత్సవం కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మండల కేంద్రంలోని హనుమాన్ క్రీడా ప్రాంగణంలో స్థానిక సర్పంచ్ మమ్మాయి రేణుకా సంజీవ్ యాదవ్ ఆధ్వర్యంలో వానమహోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా క్రీడా మైదానం చుట్టూ మొక్కలు నాటారు.
ఈ సందర్భంగా సర్పంచ్ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణ ప్రతి ఒక్కరి బాధ్యత అని మొక్కలు నాటడమే కాదు వాటిని పరిరక్షించాలి అని అన్నారు. మండలంలోని తిప్పారం గ్రామంలోని ప్రాథమిక పాఠశాలలో స్థానిక సర్పంచ్ ప్రమోద మాధవరావ్ ఆధ్వర్యంలో వనమహోత్సవం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో మొక్కలు నాటారు.
ఈ కార్యక్రమాలలో పాక్స్ ఛైర్మన్ పెద్దబూరి సాయికుమార్, ఉప సర్పంచ్ భాస్కర్ గౌడ్, స్థానిక తహసిల్దార్ రేణుకా చౌహాన్, ఎంపీడీవో రాజేశ్వర్, ఎంఇఓ శ్రీహరి, అటవీ శాఖ అధికారులు, మండల క్రీడా అభివృద్ధి కమిటీ అధ్యక్షుడు వడ్ల ప్రకాష్, కోశాధికారి సందీప్, సభ్యులు, గాంధారి గ్రామ పంచాయతీ పాలక వర్గం, పంచాయతీ కార్యదర్శి అరుణ్ కుమార్, స్థానిక యువకులు పాల్గొన్నారు..






