08-11-2025 08:59:56 PM
మీపై ఇక పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా
మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ తీవ్ర పరిణామాలు
ముత్తారంలో రౌడీ షీటర్లకు కౌన్సిలింగ్ లో మంథని సిఐ రాజు గౌడ్
ముత్తారం (విజయక్రాంతి): రౌడీ షీటర్లు ఇకనుంచి జాగ్రత్తగా ఉండాలని మీరు ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు పాల్పడ్డ తీవ్ర పరిణామాలు ఉంటాయని మంథని సీఐ రాజు గౌడ్ రౌడీషీటర్లకు కౌన్సిలింగ్ లో హెచ్చరించారు. ముత్తారం పోలీస్ స్టేషన్ లో శనివారం మంథని సీఐ రాజు గౌడ్, ముత్తారం ఎస్ఐ రవికుమార్ తో కలిసి మండలంలోని రౌడీ షీటర్లకు పాత నేరస్తులను పిలిపించి మాట్లాడారు.
మీపై ఇక పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉందాని, మళ్లీ ఎలాంటి అవాంఛనీయ ఘటనలకు పాల్పడ్డ, శాంతి భద్రతలకు విఘాతం కలిగించిన తీవ్ర పరిణామాలు ఉంటాయని సూచించారు. చాలామంది రౌడీ షీటర్ లలో ఇప్పటికే ఎంతో మార్పు వచ్చిందని, తెలుసో తెలియక చేసిన తప్పులను అర్థం చేసుకొని వారి కుటుంబ సభ్యులతో కష్టపడుతూ పనిచేస్తూ జీవిస్తున్నారని, కొంతమందిలో ఇంక మార్పు రావడం లేదని, వారిపై ప్రత్యేక దృష్టి సారించి వారు ఎలాంటి సంఘటనలకు పాల్పడ్డ చట్టపరంగా శిక్షిస్తామన్నారు.