27-05-2025 07:42:45 PM
ఖమ్మం (విజయక్రాంతి): వైఎస్ఆర్ నగర్ కు చెందిన మంచికంటి నరేష్(55) కొన్ని రోజుల క్రితం ప్రమాదవశాత్తు యాక్సిడెంట్ అయ్యి దెబ్బలు తగిలి చికిత్స పొందుతూ ఇంటి వద్దనే ఉంటున్నాడు. వైఎస్ ఆర్ నగర్ లో వారి ఇంటికి వెళ్లి పరామర్శించి, కొంత ఆర్థిక సహాయం చేసి, మీకు మీ కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చిన తోటి ఉద్యమకారుడు, బీసీ సంఘ నాయకులు, నాయి బ్రాహ్మణ సేవా సంఘం నగర అధ్యక్షులు యలమందల జగదీష్, వారి వెంట నాయి బ్రాహ్మణ నగర కమిటీ, సంఘ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.