calender_icon.png 17 June, 2025 | 6:40 AM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

ఖానాపూర్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా బాధితులకు ఆర్థిక సహాయం

16-06-2025 11:01:21 PM

ఖానాపూర్ (విజయక్రాంతి): నిర్మల్ జిల్లా ఖానాపూర్ నియోజకవర్గ ఎమ్మెల్యే వెడమ బొజ్జు పటేల్(MLA Vedma Bojju Patel) జన్మదిన సందర్భంగా ఖానాపూర్ మున్సిపాలిటీ ఎనిమిదో వార్డులో గల పేరుమల్ల వెంకటి అనే వ్యక్తికి కాంగ్రెస్ పార్టీ పట్టణ మైనార్టీ అధ్యక్షులు షౌకత్ పాషా ఆర్థిక సహాయం చేశారు. సోమవారం ఆయన ఇటీవల కురిసిన వర్షాలకు ఇంటి గోడ కూలిపోయి ఉండగా గమనించిన షౌకత్ పాషా ఇంటి నిర్మాణం కోసం 15 బస్తాల సిమెంట్ కొరకు ఆర్థిక సహాయం అందించి మానవత్వం చాటుకున్నారు. ఖానాపూర్ ఎమ్మెల్యే జన్మదినం సందర్భంగా ఈ కార్యక్రమం చేపట్టినట్లు ఆయన తెలిపారు. ప్రజా పాలనలో తమ నాయకులు ఎల్లప్పుడు ప్రజాసేవలో అందుబాటులో ఉంటామని ఆయన అన్నారు.