ముల్కనూరు సొసైటీలో నామినేషన్ల పర్వం
17-06-2025 12:00 AM
భీమదేవరపల్లి మే 16 (విజయక్రాంతి): ముల్కనూరు సహకార గ్రామీణ పరపతి, మార్కెటింగ్ సొసైటీ లిమిటెడ్ ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. ఈ సందర్భంగా 5 కార్యవర్గ స్థానాల సభ్యుల పదవి కోసం ఎన్నికల అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు.
నామినేషన్ పత్రాలు సమర్పించినవారిలో సొసైటీ ప్రస్తుత అధ్యక్షుడు అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డిపాటు దొంగల చిన్న వెంకటరాజం, బొల్లంపల్లి కుమారస్వామి, కడారి ఆదమ్, గనవేన శ్రీనివాస్, కూన కనకయ్య, గుర్రాల భాస్కర్‌రెడ్డి, మార్పాటి జైపాల్‌రెడ్డి, బోయినపల్లి రత్నాకర్‌రావు, కాశిరెడ్డి వసంత, కంకల పద్మ ఉన్నారు.






