calender_icon.png 7 December, 2025 | 11:35 PM

  • top-fb.png
  • top-tw.png
  • top-insta.png
  • top-yt.png

కూచిపూడి గ్రామంలో టపాసుల వల్ల అగ్ని ప్రమాదం

07-12-2025 02:49:58 PM

రూ.2 లక్షల ఆస్తి నష్టం

కోదాడ: కోదాడ మండలం కూచిపూడి గ్రామంలో గ్రామానికి చెందిన ఓ వ్యక్తి అంత్యక్రియల సందర్భంగా టపాసులు పేల్చిన సమయంలో చెలరేగిన నిప్పు చినగులు సమీపంలోని గడ్డువాములపై పడటంతో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో గ్రామానికి చెందిన మెట్టు శ్రీనివాసరావు, రామిశెట్టి మొగిలి, పసుపులేటి శ్రీనివాసరావు, శెట్టి గోవిందరావులకు చెందిన మొత్తం నాలుగు గడ్డువాములు పూర్తిగా దగ్ధమయ్యాయి.

ఈ ప్రమాదంలో సుమారు రూ.2 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితులు తెలిపారు. సమాచారం అందుకున్న వెంటనే ఫైర్ ఇంజన్ సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చింది. ఈ దుర్ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం వెంటనే సహాయం చేసి తగిన పరిహారం అందించాలని గ్రామస్తులు కోరుతున్నారు.